జాన్వీ కపూర్ ముద్దులకు కోత

TeluguCinema 30 Sep 2025
Janhvi Kapoor at Sunny Sanskari ki Tulsi Kumari promotions

జాన్వీ కపూర్ అందాలు ఆరబోయడంలోనే కాదు రొమాంటిక్ సన్నివేశాల్లో కూడా దూకుడుగానే ఉంటుంది. ముద్దు సీన్లకు అభ్యంతరం చెప్పదు. ఆమె నటించిన కొత్త హిందీ చిత్రం… “సన్నీ సంస్కారి కీ తులసి కుమారి”. ఈ సినిమాలో ఆమె హాట్ హాట్ గా ముద్దు సీన్లు చేసిందట.

ఆమె ముద్దు సన్నివేశాల్లో మోతాదు ఎక్కువైంది అని సెన్సార్ బోర్డు అనేక కట్స్ చెప్పిందట. 60 శాతం మేరకు ముద్దు సీన్ల లెంగ్త్ ని సెన్సార్ బోర్డు తగ్గించింది.

దీన్ని బట్టి చెప్పొచ్చు, హీరో వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ మాంచి హాట్ గా నాటుగా ముద్దు సీన్లలో నటించారని. ఈ సినిమా అక్టోబర్ 2న విడుదల కానుంది.

ALSO READ: జాన్వీ సినిమాకి థియేటర్లు లేవంట

జాన్వీ కపూర్ హిందీలో క్రేజ్ తెచ్చుకొంది కానీ భారీ హిట్స్ పొందట్లేదు. హిట్ కోసం అన్ని రకాల ప్రయత్నాలూ చేస్తోంది. ఇలా హాట్ గా నటిస్తోంది. కానీ ఆ భారీ హిట్ మాత్రం ఇంకా పడలేదు. ఈ “సన్నీ సంస్కారి కీ తులసి కుమారి”తో 2025లో ఆమె నటించిన మూడో హిందీ చిత్రం విడుదలైనట్లు.