పార్టీ పెట్టిన పాటల రచయిత

TeluguCinema 20 Jun 2023
jonnavittula

జొన్నవిత్తుల గురించి పరిచయం అక్కర్లేదు. అనేక హిట్ సాంగ్స్ ఆయన ఖాతాలో ఉన్నాయి. రాజమౌళి తీసిన విక్రమార్కుడు’లో ‘జింతాత జిత”, “శ్రీరామరాజ్యం”లో అన్ని పాటలూ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు రాశారు. అటు భక్తి గీతాలు, ఇటు రక్తి పాటలు …. రెండింటిలోనూ దిట్ట.

విజయవాడకి చెందిన జొన్నవిత్తుల ఇప్పుడు పార్టీ పెట్టారు. ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆయన పార్టీ పేరు… ‘జై తెలుగు’. తెలుగు భాషని పరిరక్షించేందుకు ఈ పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు.

తెలుగు భాష పరిరక్షణ అజెండాతో రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తానని అంటున్నారు. ఆయన ఒక్కరే ఈ పార్టీ తరఫున పోటీ చేస్తారా లేదా ఇంకా ఎవరైనా బరిలో ఉంటారా అనేది చూడాలి.

ఎన్నో భక్తి పాటలు రాసినా తనకు సరైన పురస్కారాలు దక్కలేదని ఆయన భావిస్తున్నారు.