- Advertisement -

బాలీవుడ్ సీనియర్ నటి జూహీ చావ్లాకి షాక్ తగిలింది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఆమె కళ్ళు బైర్లు కమ్మడం ఖాయం. దేశంలో 5జి టెక్నాలజీని ప్రవేశపెట్టొద్దని కోరుతూ ఆమె పిటిషన్ వేసింది. కొవిడ్ కారణంగా కోర్టులు పనిచెయ్యడం లేదు. అంతా ఆన్ లైన్ లోనే వాదోపవాదాలు. కోర్టు విచారణకి చెందిన లింక్ ని జూహీ చావ్లా సోషల్ మీడియాలో షేర్ చేసిందట. ఆమె అభిమానులు కొందరు లైవ్ లోకి వచ్చి ఆమె సినిమా పాటలు కూడా పాడారట. దాంతో దీనిపై జడ్జి విచారణకి ఆదేశించారు.
అంతేకాదు, ఆమె వేసిన పిటిషన్ లో అసలు మేటర్ లేదని, పబ్లిసిటీ కోసం ఆమె చేసిన ప్రయత్నంలా ఉందని ఢిల్లీ కోర్టు ఈ రోజు తీర్పు ఇచ్చింది.
ఇలాంటి వాటిని సహించేది లేదంటూ కోర్టు విలువైన కాలాన్ని వృధా చేసినందుకు జూహీ చావ్లాకు 20 లక్షల ఫైన్ విధించారు జడ్జి.