జగన్ కి కైకాల థాంక్స్ లెటర్

Kaikala Satyanarayana


సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ పూర్తిగా కోలుకున్నారు. గతేడాది నవంబర్ లో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. దాంతో, అపోలోలో చేర్పించారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కైకాలకు ఫోన్ చేసి, ఆయన చికిత్సకి కావాల్సిన ధన సహాయం అందచేశారు.

ఇప్పుడు పూర్తిగా కోలుకున్న కైకాల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ ఓ లేఖ రాశారు. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని, జగన్ ని కైకాల ప్రశంసించారు.

“ఆర్థిక సహాయంతో సహా అన్ని రకాల సహాయాన్ని అందించారు. ఆ కష్ట సమయాల్లో మీ సహాయం నాకు, నా కుటుంబానికి అద్భుతమైన శక్తిని ఇచ్చింది. మీరు చూపిన ఈ శ్రద్ధ మీకు కళాకారుల పట్ల మరియు వారి శ్రేయస్సు పట్ల ఉన్న గౌరవాన్ని మరోసారి రుజువు చేసింది. ప్రజల పట్ల మీకు ఉన్న శ్రద్ధ రాష్ట్రం మంచి చేతుల్లో ఉందనే భరోసా ఇస్తుంది,”అని కైకాల తన లేఖలో రాశారు.

కైకాలకి 86 ఏళ్ళు. వందల చిత్రాల్లో నటించారు. అనేక చిత్రాలు కూడా నిర్మించారు. ఆయన గతంలో టీడీపీ తరపున ఎంపీగా కూడా గెలిచారు.

More

 

Related Stories