పెళ్లి ప్రస్తావన వద్దు ప్లీజ్!

Shruti Haasan


శృతి హాసన్ కి పెళ్లి అంటే అస్సలు ఇష్టం లేదు. “నేను లివిన్ రిలేషన్ షిప్ లో ఉంటాను…కానీ పెళ్లి చేసుకోను,” అని గతంలోనే ప్రకటించింది శృతి. ఆమెకిప్పుడు 35 ఏళ్ళు. అయినా ఆమె ఆలోచనలో మార్పు లేదు.

ఆమె తన బాయ్ ఫ్రెండ్స్ వివరాల గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటుంది. సిద్ధార్థ్, నాగ చైతన్య, మైకేల్ కొర్సాల్… ఇలా పలువురితో డేటింగ్ చేసింది. ఆ విషయాలు ఎప్పుడూ దాచలేదు. కానీ మీడియా పెళ్లి ప్రస్తావన తెస్తే కస్సుమని కోపం తెచ్చుకుంటుంది.

శాంతను హజారికా ఆమె లేటెస్ట్ బాయ్ ఫ్రెండ్. అతన్ని తాను మొదటిసారి ఎప్పుడు కలిసింది, అతని ఇష్టాలు ఏంటో, అతను ఏమి తింటాడో, తనలో ఏమి ఇష్టపడుతాడో… ఇలా బోల్డెన్ని విషయాలు ఇన్ స్టాగ్రామ్ లో వీడియో రూపంలో తరుచుగా అప్డేట్ చేస్తోంది. మీడియా ఇంటర్వ్యూలలో కూడా అదే విషయం వెల్లడిస్తోంది. సో… వీరి బంధం సీరియస్ గా మారిందా అని డౌట్స్ వస్తాయి కదా?

తాజాగా ఒక మేగజైన్ ఇదే విషయాన్నీ అడిగింది. అంతే… దయచేసి పెళ్లి ప్రస్తావన తీసుకురావద్దు అని ఖరాఖండీగా చెప్పేసింది.  శాంతను హజారికాని పెళ్లి చేసుకునే ఆలోచన లేదన్నట్లుగానే మాట్లాడింది. ఆ మాటకొస్తే… ఆమె పెళ్లి కాన్సెప్ట్ కి వ్యతిరేకం.

తల్లితండ్రులు కమల్ హాసన్, సారిక విడిపోవడం ఆమెపై చాలా నెగెటివ్ ప్రభావం చూపింది కాబోలు. అందుకే, ఆమెకి పెళ్లిపై ఆసక్తి లేదు.

 

More

Related Stories