2022లో కాజల్ సందడి ఎక్కువే

Kajal


కాజల్ అగర్వాల్ అమ్మ కాబోతుంది. మరో నాలుగు నెలల్లో ఆమె ఒక పాపకో, బాబుకో జన్మనివ్వనుంది. తల్లి కాబోతుండటంతో ఆమె సినిమాలు వదులుకొంది. ఐతే, గతేడాది ఏడాది ఆమె నటించిన పలు సినిమాలు ఈ ఏడాది విడుదల కానున్నాయి.

రెండేళ్లుగా వాయిదా పడుతోన్న ‘ఆచార్య’ ఈ వేసవిలో విడుదల కానుంది. ‘ఆచార్య’లో ఆమె చిరంజీవి సరసన నటించింది. ‘ఖైదీ నంబర్ 150’ చిరంజీవికి ఆమె లవర్ గా నటించిన రెండో చిత్రం ఇది. అలాగే, దుల్కర్ సల్మాన్ తో కలిసి నటించిన లవ్ స్టోరీ ‘సినామిక’ అనే చిత్రం కూడా త్వరలోనే విడుదల అవుతుంది. ఫేమస్ కొరియోగ్రాఫర్ బృంద ఈ సినిమాతో దర్శకురాలిగా మారారు.

హిందీలో ఆమె నటించిన ‘ఉమా’ అనే చిత్రం డైరెక్ట్ గా ఓటిటి వేదికపైకి రానుంది. ఇది కూడా సమ్మర్లోనే స్ట్రీమ్ అవుతుంది. అలాగే, తమిళంలో ఆమె నటించిన ఒక హారర్ థ్రిల్లర్ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. మొత్తంగా ఈ ఏడాది ఆమె నటించిన నాలుగు చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి.

2022లో ఆమె ఒక్క చిత్రంలో కూడా నటించే అవకాశం లేదు. కానీ, కాజల్ థియేటర్లలో, ఓటిటి వేదికలపై ఈ ఏడాది సందడి బాగానే చేస్తుంది.

Advertisement
 

More

Related Stories