కీర్తికి ఆనందమే

TeluguCinema 08 Apr 2023
keerthy stills 280223 006

కీర్తి సురేష్ తెలుగులో అనేక సినిమాల్లో నటించిన ఇటీవల కాలంలో సరైన హిట్ లేదు. మహేష్ బాబు తో నటించిన ‘సర్కార్ వారి పాట’ సినిమా పెద్దగా పేరు తేలేదు. అది మోస్తరు విజయమే. సాలిడ్ కోసం చూస్తున్న ఈ భామకి ‘దసరా’ ఆనందాన్ని తెచ్చిపెట్టింది. నాని కెరీర్ లో మొదటి ‘100 కోట్ల గ్రాస్’ మూవీగా నిలిచింది ‘దసరా’. అలా ఒక మంచి హిట్ ని తన ఖాతాలో వేసుకొంది కీర్తి.

అంతే కాదు, ఈ సినిమాలో పెళ్లి బారాత్ డ్యాన్స్ చేసి అదరగొట్టింది. డ్యాన్స్ విషయంలో కూడా ఆమెకి మార్క్స్ పడ్డాయి. ఆ విధంగా ‘దసరా’ ఆమెకి అన్నివిధాలా బెనిఫిట్ చేసింది. నానితో నటించిన రెండు సినిమాలు హిట్ కావడం కూడా విశేషమే. వీరిది హిట్ పెయిర్ అన్న ముద్ర పడింది.

కీర్తి సురేష్ మరో తెలుగు చిత్రం ఇంకా ఒప్పుకోలేదు. కానీ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలుగా ‘భోళాశంకర్’లో నటిస్తోంది. ఆమె తదుపరి విడుదల ఇదే.

నటిగా ఆమె ఎప్పుడో జాతీయ అవార్డు అందుకొంది. కానీ, హిట్ రేట్ లో కొంచెం వెనుకబడింది. అది ఇప్పుడు సెట్ అయింది.

TeluguCinema

View all posts

Recent News