ఈ గంగమ్మకి ‘కాంతర’ స్ఫూర్తి!


అల్లు అర్జున్ ‘గంగమ్మ’ అవతారంలో కనిపించిన పోస్టర్ ని లేటెస్ట్ గా విడుదల చేశారు. ఈ రోజు అల్లు అర్జున్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా టీజర్ తో పాటు ఒక పోస్టర్ బయటికి వచ్చింది. ఈ పోస్టర్ లో అల్లు అర్జున్ ‘పోతురాజు’ తరహాలో ఉన్న గెటప్ తో కనిపించారు.

ఐతే, చిత్తూరు జిల్లాల్లో గంగమ్మ పండుగ జరుపుకున్నప్పుడు ఇలా దేవత గెటప్ లో మగవాళ్ళు కనిపిస్తారట. ‘పుష్ప’ సినిమా చిత్తూరు నేపథ్యంగానే సాగే కథ. అందుకే, బన్నికి ఈ గెటప్ వేశారు. ‘కాంతార’ సినిమాలో హీరోకి అక్కడి స్థానిక ఆచారం ప్రకారం వేసిన గెటప్, అతను ‘శిగం’ ఊగిన తీరు జనాలకు తెగ నచ్చింది. ఆ సినిమా పాన్ ఇండియా లెవల్లో ఆడింది.

‘పుష్ప’ కూడా హిందీలో బాగా ఆడింది. ‘పుష్ప 2’కి మరింత హైప్ తెచ్చేందుకు ‘కాంతర’ స్ఫూర్తితో బన్నీకి ఈ గెటప్ వేయించి పోస్టర్ రిలీజ్ చేశారు. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా మరో ‘కేజీఎఫ్’ లేదా ‘ఆర్ ఆర్ ఆర్’లా సక్సెస్ చెయ్యాలనేది ప్లాన్. అందుకే ఇంత హంగామాచేస్తున్నారు పబ్లిసిటీ విషయంలో.

ఈ పోస్టర్ లో బన్ని గెటప్ కి మంచి స్పందనే వచ్చింది.

 

More

Related Stories