
రాజమౌళి తీసిన ‘ఆర్ ఆర్ ఆర్’ మొదటి రోజు సృష్టించిన బాక్సాఫీస్ సునామీ అలా ఇలా కాదు. అమెరికాలో కూడా రికార్డ్. ఐతే, నార్త్ ఇండియా, ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో రికార్డులు రాలేదు.
‘కేజిఎఫ్’కి సీక్వెల్ గా విడుదలైన ‘కెజిఎఫ్ 2’ అనూహ్యంగా నార్త్ ఇండియాలో కొత్త రికార్డు సృష్టించింది. దాదాపు 40 కోట్లపైన మొదటి రోజు హిందీ వర్షన్ కి వచ్చేలా ఉంది. ‘ఆర్ ఆర్ ఆర్’ మొదటి రోజు నార్త్ లో వచ్చిన దాని కన్నా రెండింతలు కన్నా ఎక్కువ.
కర్ణాటకలో సహజంగానే ఈ కన్నడ చిత్రం రికార్డు వసూళ్లు సాధించింది మొదటి రోజు. కేరళలో కూడా రాజమౌళి చిత్రానికి మించి ఓపెనింగ్ వచ్చింది. తమిళనాడులో విజయ్ నటించిన ‘బీస్ట్’ పోటీలో ఉన్నప్పటికీ అక్కడ కూడా ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాకి మించి వసూళ్లు అందుకొంది.
కేవలం తెలుగు రాష్ట్రాల్లో, ఓవర్సీస్ లో మాత్రం ‘ఆర్ ఆర్ ఆర్’ సాధించిన దానితో చాలా తక్కువ పొందింది ‘కెజిఎఫ్ 2’. ఐతే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో మొదటి రోజు వసూళ్లు పెద్ద సినిమాలకు సమానంగానే వచ్చాయి. ఈ సినిమాకి కూడా టికెట్ రేట్లు పెంపు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. దాంతో, భారీ ఓపెనింగ్ కి, టికెట్ రేట్లు కూడా కలిసొచ్చి పెద్ద అమౌంట్ కనిపిస్తోంది మొదటి రోజు.
ఏది ఏమైనా, ఒక కన్నడ చిత్రం దేశమంతా ఈ రేంజు వసూళ్లు, హంగామా సృష్టించడం కనీవినీ ఎరుగనిది. రాజమౌళికి ఇప్పటికే దేశమంతా స్టార్ ఇమేజ్ ఉంది. కాబట్టి ఆయన సినిమాలకు భారీ ఓపెనింగ్ సహజం. కానీ, ‘కెజిఎఫ్ 2’ మొదటి రోజు వసూళ్లు మాత్రం గ్రేట్.
ఇది కూడా చదవండి: KGF Chapter 2 – తెలుగు రివ్యూ