ఖుష్బూ కుటుంబ కథా చిత్రమ్

తెలుగు ప్రజలకు ఖుష్బూ గురించి పరిచయం అక్కర్లేదు. ఎన్నో హిట్ సినిమాలు చేశారు, ప్రస్తుతం బుల్లితెరపై అలరిస్తున్నారు. వీటితో పాటు తన బోల్డ్ స్టేట్ మెంట్స్ తో కూడా ఆమె ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్నారు.
ఇప్పుడీ మాజీ హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్టు తన కుటుంబాన్ని వెండితెరకు పరిచయం చేస్తోంది. ఖుష్బూ కుమార్తెలు ఇద్దరూ సినిమా రంగంలో అడుగుపెడుతున్నారు. చిన్న కూతురు ఆనందిత దర్శకురాలిగా మారింది.
ఖుష్బూ పెద్ద కూతురు అవంతిక లీడ్ రోల్ లో, ఆనందిత దర్శకత్వంలో సినిమా వస్తోంది. ఈ సినిమాకు నిర్మాత ఖుష్బూ భర్త సుందర్ సి. ఇందులో ఓ కీలక పాత్రలో ఖుష్బూ కూడా కనిపించనుంది.
ఇలా కుటుంబమంతా కలిసి ఓ సినమా తీస్తున్నారు/చేస్తున్నారు. అయితే హీరో ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని వివరాలు బయటకు రాబోతున్నాయి.