కియరాకి హ్యాట్రిక్ ఫ్లాపులు

- Advertisement -
Kiaraadvani Redlong

కియారా అద్వానీకి ఉన్న క్రేజ్ వేరు. పెళ్లి తర్వాత కూడా అది ఏ మాత్రం తగ్గలేదు. అంతే కాదు, బాలీవుడ్ లోనూ, టాలీవుడ్ లోనూ సేమ్ క్రేజ్, రెండుచోట్లా భారీ పారితోషికం అందుకునే కొద్దిమంది హీరోయిన్లలో ఒకరు కియారా.

ఐతే, ఈ భామకి ప్రస్తుతం టైం కలిసి రావడం లేదు. గత రెండేళ్ళలో ఆమె నటించిన నాలుగు చిత్రాలు విడుదల అయ్యాయి. అందులో ఒక్కటే హిట్ అయింది. మిగతా మూడు ఫ్లాప్. ఈ మూడూ కూడా వరుసగా ఫ్లాప్ అయ్యాయి. తాజాగా విడుదలైన “సత్యప్రేమ్ కి కహానీ” కూడా విజయం సాధించలేదు. ఈ సినిమాకి మొదట మంచి టాక్ వచ్చింది. రివ్యూస్ కూడా బాగా వచ్చాయి. పైగా సినిమాలో ఒక మంచి సందేశము కూడా ఉందని ప్రశంసలు దక్కాయి.

ఐతే, ఈ సినిమా పది రోజుల తర్వాత కూడా 60 కోట్ల మార్క్ ని దాటలేదు. ఇండియాలో ఈ సినిమా ఇప్పటివరకు 58 కోట్లు కొల్లగొట్టింది. బడ్జెట్, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుంటే ఈ సినిమా 100 కోట్లు చెయ్యాలి. అప్పుడే హిట్ గా భావిస్తారు. ప్రస్తుతం ఈ సినిమా ఫ్లాప్, యావరేజ్ మధ్య ఊగిసలాడుతోంది.

ప్రస్తుతం ఈ భామ తెలుగులో రామ్ చరణ్ సరసన ‘గేమ్ ఛేంజర్’లో నటిస్తోంది. శంకర్ తీస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో ఆమె విజయాల బాట పడుతుందా?

More

Related Stories