ధనుష్ మాజీ భార్య రెండో పెళ్లి!

- Advertisement -
Aishwarya Rajinikanth

ధనుష్ ఇప్పుడు రజినీకాంత్ కి మాజీ అల్లుడు. రజినీకాంత్ మొదటి కూతురు ఐశ్వర్యని పెళ్లి చేసుకొని18 ఏళ్ళు సంసారం చేశాక విడిపోయాడు ధనుష్. ఇద్దరిలో ఎవరు డివోర్స్ కి కారణం అనేది తెలియదు కానీ వీరిద్దరూ విడిపోయి దాదాపు రెండేళ్లు అవుతోంది. ఇటీవల ధనుష్ రెండో పెళ్లి గురించి చాలా పుకార్లు వినిపించాయి. సంయుక్తతో పెళ్లి అని మొదట వినిపించింది. తర్వాత పాతకాలపు హీరోయిన్ మీనాతో పెళ్లి అని ఒక యూట్యూబర్ పుకారు లేపారు.

అవన్నీ పుకార్లుగానే మిగిలిపోయాయి. ఇప్పుడు ఐశ్వర్య రెండో పెళ్లి గురించి ప్రచారం మొదలైంది.

ఐశ్వర్య ఇటీవల ఒక తమిళ నటుడితో ఒక రిసార్ట్ లో కనిపించడం ఈ పుకార్లకు కారణమైంది.

ఐశ్వర్య, ధనుష్ కి ఇద్దరు పిల్లలు. ఇద్దరూ అబ్బాయిలే. ప్రస్తుతం పిల్లలు ఆమెతోనే ఉంటున్నారు. మరోవైపు, ఆమె “లాల్ సలామ్” అనే సినిమా డైరెక్ట్ చేస్తోంది. మరి, వృత్తిపరంగా ఇంత బిజీగా ఉన్న ఐశ్వర్య నిజంగా రెండో పెళ్లి చేసుకోబోతుందా అనేది చూడాలి. లేదా ఇదో మరో పుకారుగానే మిగులుతుందా?

 

More

Related Stories