పరీక్ష పాస్ అయిన కృతి శెట్టి

Krithi Shetty

“ఉప్పెన” సినిమాతో అడుగుపెట్టిన కృతి శెట్టి లిట్మస్ టెస్ట్ పాస్ అయింది. ఆమె తొలి సినిమా బ్లాక్ బస్టర్. ఐతే, మొదటి సినిమాతో మెప్పించిన ఎందరో హీరో, హీరోయిన్లు రెండో సినిమాతోనే తెరమరుగు అయ్యారు. కృతి శెట్టి రెండో సినిమాతో మెప్పిస్తుందా లేదా అన్న డౌట్స్ విడిపోయాయి.

ఆమె రెండో చిత్రం…’శ్యామ్ సింగ రాయ్’. ఈ మూవీ డిసెంబర్ 24న రిలీజ్ అయింది. విమర్శకుల ప్రశంసలు అందుకొంది. సినిమా కూడా విజయవంతంగా దూసుకుపోతోంది.

“ఉప్పెన”లో విలేజ్ గర్ల్. “శ్యామ్ సింగ రాయ్”లో మాడ్రన్ అర్బన్ గాల్. ఆ వైవిధ్యం చూపింది. కొంచెం బోల్డ్ గా నటించింది. ఈ పాత్రకి అయినా సూట్ అవుతుంది అని తెలిసిపోయింది. ఈ భామ రెండో సినిమాతో డిస్టింక్షన్ లో పాస్ అయింది.

“నాకు వచ్చే పాత్రలపై నేనే రీసెర్చ్ చేసుకుంటాను. ఆ కారెక్టర్ ఎలా ఉంటుంది.. ఆమె అలవాట్లు ఏంటి? శ్యామ్ సింగ రాయ్ సినిమాలో కీర్తి పాత్రకు తల్లి ఉండదు. తండ్రి పెంపకంలోనే పెరుగుతుంది. అప్పుడు కాస్త మగరాయుడిలా ఉంటే బాగుంటుందని దర్శకుడికి చెప్పాను. నాకు స్మోకింగ్ అంటే నచ్చదు. కానీ ఈ పాత్ర కోసం అలా నటించాను. (డమ్మీ) సిగరెట్లను తాగడం మూడు రోజులు ప్రాక్టీస్ చేశాను,” అని చెప్పింది ఈ భామ.

నాని ఇచ్చిన సపోర్ట్ వల్లే అంత కంఫర్ట్‌గా నటించగలిగాను అని కూడా చెప్తోంది.

తన కథల సెలెక్షన్ గురించి కూడా వివరించింది. “నేను మా అమ్మ కలిసే కథను వింటాం. ఓకే చేస్తాం. నాకు ఆ పాత్ర సెట్ అవుతుందని అనిపిస్తేనే ఓకే చెబుతాను,” అని తెలిపింది.

వచ్చే నెలలో “బంగార్రాజు” సినిమాతో మరోసారి మనముందుకు రానుంది ఈ భామ. అది ఆమెకి మూడో చిత్రం.

Advertisement
 

More

Related Stories