శభాష్ తెలంగాణ సర్కార్: విజయ్

- Advertisement -
Vijay Deverakonda

యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలకు ఫిదా అయ్యాడు. కరోనాతో కుదేలు అయిన సినిమా థియేటర్లను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకొంది. అందులో ఒకటి టికెట్ రేట్ల పెంపు.

సినిమా ఇండస్ట్రీ చేసిన మరికొన్ని ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు. దాంతో, విజయ్ దేవరకొండ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపాడు.

“తెలంగాణలో సినీ పరిశ్రమ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది. దేశంలో రెండో అతిపెద్ద చిత్ర పరిశ్రమ తెలుగు చిత్రసీమ. కరోనా సంక్షోభ కాలంలో బాగా దెబ్బతిన్న థియేటర్ల వ్యవస్థకి సపోర్ట్ గా ప్రభుత్వం నిలవడం శుభ పరిణామం,” అని ట్విట్టర్ లో రాశాడు విజయ్

“టికెట్ ధరలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం గొప్ప చర్య. పరిశ్రమ అభివృద్ధి కోసం పాటుపడుతున్న తెలంగాణ సర్కార్ కు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. ముఖ్యమంత్రి కేసీఆర్ తోపాటు మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ రాష్ట్రంలో స్థిరమైన అభివృద్ధి కోసం కృషి చేస్తున్నార,”ని విజయ్ కొనియాడాడు.

 

More

Related Stories