కృతి అనుష్కలా కాదు!

Kriti Sanon

మొన్నటి వరకు అనుష్క గురించి పుకార్లు. ప్రభాస్, అనుష్క పెళ్లి గురించి మీడియాలో, సోషల్ మీడియాలో దాదాపు 8 ఏళ్ళు వార్తలు కొనసాగాయి. ఇప్పుడు అది ఓల్డ్ మేటర్.

ఇప్పుడు కృతి సనన్ తో ప్రభాస్ డేటింగ్ అంటూ ప్రచారం మొదలైంది. ఐతే, ఈ రూమర్లకు రెండు రోజుల్లోనే చెక్ పడింది. అనుష్కలా కృతి సనన్ సైలెంట్ గా ఉండలేదు. సోషల్ మీడియాలోనే ఈ వార్తలకి బ్రేక్ వేసింది.

“ప్రేమ లేదు, గీమా లేదు. ఇక పెళ్లి ముచ్చట దరువు వెయ్యకముందే చెప్పేస్తున్నా అదంతా అబద్దమే,” అనే అర్థంలో కృతి సనన్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

Kriti Sanon

ALSO READ: Kriti Sanon denies being in relationship with Prabhas

అనుష్క, ప్రభాస్ గురించి చాలా కాలం పుకార్లు సాగినా ఆమె స్పందించలేదు. కృతి సనన్ మాత్రం భయపడకుండా సోషల్ మీడియాలో పెట్టేసింది. ఐతే, ఆమె పోస్ట్ తో ఈ పుకార్లకు బ్రేక్ పడుతుందా? నిజంగానే ప్రభాస్, కృతి మధ్య ఏమి లేదా అనేది చెప్పలేం.

కానీ, తమ డేటింగ్ గురించి ఒక మాట టీవీలో వచ్చేట్లు చేసుకొని, ఆ తర్వాత క్విక్ గా ‘ఖండించడం’ అనే గడుసుదనం చూసి బాలీవుడ్ భామల పద్దతే వేరు అంటున్నారు జనం.

 

More

Related Stories