ఫ్యాన్స్ ని డైలమాలో పడేసింది కదా!

హీరోయిన్ కృతి సనన్ పద్దతి అర్థం కావడం లేదు. ఏ హీరోతో ఈ అమ్మడు డేటింగ్ లో ఉందనే విషయంలో తికమకగా ఉందట. ఇంతకీ మేటర్ ఏంటంటే…

కృతి సనన్ ఇప్పుడు బాలీవుడ్ లో లీడింగ్ పొజిషన్ లో ఉంది. దీపికకి వివాదాలు ఎక్కువ. అలియా భట్ తల్లిగా మారి సినిమాల నుంచి బ్రేక్ ఇచ్చింది. కత్రినా కైఫ్ జోరు లేదు. కంగనా హవా తగ్గింది. తాప్సికి హిట్స్ లేవు. సో, ఇప్పుడు కాబోయే టాప్ హీరోయిన్ ఈ అమ్మడే. ఈ భామ ఈ మధ్య ప్రభాస్ తో డేటింగ్ చేస్తోందని వార్తల్లోకి వచ్చింది. ఆ వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పినా, ప్రభాస్ అభిమానులు నమ్మలేదు. బాలీవుడ్ మీడియా కూడా ప్రభాస్, కృతి మధ్య సంథింగ్ సంథింగ్ ఉందని భావిస్తోంది.

ఐతే, ఆమె తాజాగా క్రిస్మస్ పండుగని మరో బాలీవుడ్ హీరోతో జరుపుకొని అందర్నీ కన్ఫ్యూజన్ లో పడేసింది.

ఫ్యాన్స్ కి పిచ్చెక్కిస్తున్న కృతి

Kriti Sanon

బాలీవుడ్ యువ హీరోలలో అందగాడిగా పేరొందిన కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ కలిసి ‘షెహజాదా’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇది ‘అల వైకుంఠపురంలో’ సినిమాకి రీమేక్. ఈ సినిమా షూటింగ్ లో ఉన్నారు వీరిద్దరూ. ఐతే, క్రిస్మస్ రోజు మాత్రం వీరు జంటగా సెలెబ్రేట్ చేసుకోవడం విశేషం. అంతే కాదు, జంటగా సోషల్ మీడియాలో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.

ఇంతకీ ఈ భామ ఏ హీరోతో డేటింగ్ లో ఉంది? కార్తీక్ ఆర్యన్ తోనా? ప్రభాస్ తోనా?

 

More

Related Stories