14 రోజులకే ఓటిటిలోకి ‘మామా’

గత వీకెండ్ అరడజను చిత్రాలు విడుదల అయ్యాయి. అందులో “మ్యాడ్” అనే యూత్ ఫుల్ చిత్రం ఒక్కటే ఆడుతోంది. మిగతావన్నీ టపా కట్టాయి. ఈ బ్యాచ్ లో ఉన్న ఒక చిత్రం… మామా మశ్చీంద్ర.

సుధీర్ బాబు మూడు పాత్రలు పోషించిన “మామా మశ్చీంద్ర” అక్టోబర్ 6న థియేటర్లోకి వచ్చింది. ఇక అక్టోబర్ 20న ఓటిటిలో స్ట్రీమ్ కానుంది. అంటే థియేటర్లో విడుదలైన 14 రోజులకే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లోకి వస్తోంది.

సినిమా ఘోరంగా ఫ్లాప్ అవుతుందని నిర్మాతలు ముందే భావించినట్లు ఉన్నారు. అందుకే, అమెజాన్ ప్రైమ్ తో ముందే మాట్లాడుకున్నారట. సినిమా ఆడకపోతే రెండు వారాల్లోనే మీరు స్ట్రీమ్ చేసుకోవచ్చని చెప్పారట.

ఇటీవల సుధీర్ బాబు నటించిన చిత్రాలేవీ ఆడడం లేదు. దీనికన్నా ముందు వచ్చిన “హంట్” అనే సినిమా దారుణ పరాజయం చూసింది. ఇక ఈ “మామ” ఐతే ఓపెనింగ్ కూడా సాధించలేకపోయాడు. సుధీర్ బాబు సరసన ఇషా రెబ్బ, మృణాలిని రవి హీరోయిన్లుగా నటించారు. ఈ భామల కెరీర్ కూడా ఎదగడం లేదు.

Advertisement
 

More

Related Stories