మద్రాస్ నా జన్మభూమి: బాలకృష్ణ

TeluguCinema 03 Dec 2025
Akhanda 2

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తోన్న “అఖండ 2: తాండవం” తమిళంలో కూడా భారీగా విడుదల కానుంది. దాంతో చెన్నైలో కూడా ప్రమోషన్స్ చేస్తున్నారు. చెన్నై లో జరిగిన ప్రెస్ మీట్ లో బాలయ్య తమిళ భాషలోనే మాట్లాడారు.

“నేను ఇక్కడ పుట్టడం వల్ల చెన్నై నాకు సొంతిల్లులా అనిపిస్తుంది. మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంధ్ర నా ఆత్మభూమి,” అని బాలయ్య ప్రకటించారు.

“ధర్మం కోసం జీవించాలి సత్యం కోసం పోరాడాలి, అన్యాయం ముందు తలవంచకూడదు అని మన సనాతన హైందవ ధర్మం చెప్పింది. ఈ సినిమాలో సనాతన ధర్మం పరాక్రమం చూస్తారు. భవిష్యత్ తరాలు ఈ సినిమా ద్వారా సనాతన ధర్మం గురించి నేర్చుకుంటారు. ఇది ప్రేక్షకులకు శాంతిని తెస్తుంది. ఈ సినిమా ఒక ఎన్సైక్లోపీడియా. మా నాన్న గారు నా గురువు, దైవం ఆయన పురాణాలు, సామాజిక, ఫాంటసీ వంటి విభిన్నమైన చిత్రాలను చేశారు. నేను ఆయన బాటలోనే నడుస్తున్నాను,” అని బాలయ్య తెలిపారు.

“ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు పూర్తవడం, ఇప్పటికీ హీరోగా కొనసాగుతుండటం నా తల్లితండ్రులు, అభిమానులు ఆశీస్సులని భావిస్తున్నాను. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్‌ కేసరి, డాకు మహారాజ్‌ వరుసగా హిట్లు కొట్టాం. ‘అఖండ 2’ ఆ జాబితాలో చేరుతుంది,” అని ధీమా వ్యక్తం చేశారు.