మహేష్ కి ఆ అలవాటుందట

Mahesh Babu

హీరోలందరికీ ఎదో ఒక అలవాటు ఉంటుంది. షూటింగ్ లొకేషన్ లో ప్రతి నటుడు, నటి గంటల తరబడి తమ ‘షాట్’ కోసం వెయిట్ చెయ్యాల్సి ఉంటుంది. ఆ సమయంలో తమ వ్యానిటి వ్యాన్లల్లో కూర్చొని ఏమి చేస్తారు? ఒక్కొక్కరికి ఒక్కో వ్యాపకం.

వెనకటి కాలంలో ఎదో ఒక చెట్టు కింద కూర్చొని కార్డ్స్ ఆడేవారు. కానీ ఇప్పుడు ఆ సంస్కృతి పోయింది. ఐతే పెళ్లి వేడుకల్లో పేకాట ఆడడం అనే సంస్కృతి ఇంకా ఉంది. ఐతే, మహేష్ బాబు లాంటి బడా స్టార్ కూడా పేకాట ఆడుతారు అని ఎవరూ ఊహించరు కదా. కానీ మహేష్ బాబుకి ఆ సరదా ఉందట. ఇంట్లో ఫంక్షన్ లు జరిగితే, దగ్గరివారి పెళ్లి వేడుకలకు వెళ్తే పేకాట ఆడుతారట. ఆ అలవాటు ఉందట.

ఇటీవల ఒక ఫంక్షన్ లో మహేష్ బాబు, వెంకటేష్ ఇతరులు కలిసి పేకాట ఆడుతున్న ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. వెంకీ, మహేష్ బాబు డబ్బులు ముందుపెట్టుకుని మరి గేమ్ ఆడారు.

మరోవైపు, మహేష్ బాబు నటిస్తున్న “గుంటూరు కారం” చిత్రం షూటింగ్ వేగంగా జరుగుతోంది. సంక్రాంతికి విడుదల చేసేందుకు అన్ని పనులు పూర్తి చేస్తున్నారు.

Advertisement
 

More

Related Stories