మహేష్ బాబు సరసన చెల్సీ?

TeluguCinema 07 Jan 2024
Chelsea Elizabeth Islan

రాజమౌళి – మహేష్ బాబు సినిమా షూటింగ్ మరో రెండు నెలల్లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. అంటే హీరోయిన్, ఇతర తారాగణం ఎన్నుకోవడం, లొకేషన్లు చూడడం, సాంకేతిక నిపుణలను తీసుకోవడం వంటి పనులను రాజమౌళి మొదలుపెట్టారని టాక్.

తాజాగా వినిపిస్తున్న మాట ఏంటంటే ఒక విదేశీ భామని హీరోయిన్ గా తీసుకోవాలని రాజమౌళి భావిస్తున్నారట. “ఆర్ ఆర్ ఆర్” సినిమాలో ఎన్టీఆర్ సరసన ఒలీవియా మారిస్ అనే బ్రిటన్ భామని నటింపచేశారు. ఇప్పుడు మహేష్ బాబు సరసన కూడా ఇండోనేషియాకు చెందిన చెల్సీ (Chelsea Elizabeth Islan)ని తీసుకోవాలని అనుకుంటున్నారట.

మహేష్ బాబుతో రాజమౌళి ఒక అడ్వెంచర్ థ్రిల్లర్ ని రూపొందిస్తున్నారు. కథ అనేక దేశాల్లో జరుగుతుంది. అందుకే, కథ ప్రకారం ఒక హీరోయిన్ ని ఇండోనేసియాకి చెందిన భామని తీసుకోవాలి అని భావిస్తున్నారట.

మరి నిజంగా ఆమెని తీసుకుంటారా లేక మరో విదేశీ భామని సంప్రదిస్తారా అన్నది చూడాలి.