ముందే అభిమానులతో మీటింగ్

Mahesh Babu

రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో భారీ సినిమా తెరకెక్కనుంది. “ఆర్ ఆర్ ఆర్” సినిమాతో రాజమౌళి ప్రతిభని హాలీవుడ్ పెద్ద దర్శకులు గుర్తించారు. ఇప్పుడు తన లెవల్ ని మరింతగా పెంచుకునేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. మహేష్ బాబు సినిమా బడ్జెట్ కానీ, తీసే లొకేషన్లు కానీ, వేసే సెట్లు కానీ అన్ని “గ్లోబల్” లేవల్లోనే ఉంటాయి.

ఈ సినిమాని రాజమౌళి ఇప్పటివరకు తాను తీసిన సినిమాల అన్నింటి కన్నా గ్రాండ్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. దాని కోసమే ప్రీ- ప్రొడక్షన్ పని భారీగా సాగుతోంది.

షూటింగ్ కు ముందు చేసే ప్లానింగ్ … ప్రీ ప్రొడక్షన్. ఈ సినిమా షూటింగ్ జూన్ తర్వాత ఉంటుంది. అంటే వచ్చే నాలుగు నెలలు మహేష్ బాబు తన బాడీని తీర్చిదిద్దుకోవడం, ఆ సినిమాకి కావాల్సిన స్టయిలింగ్ ని మలుచుకోవడంపైన శ్రద్ద పెట్టాలి. షూటింగ్ కి నాలుగు నెలల టైముంది. కానీ ఒక్కసారి రాజమౌళి షూటింగ్ మొదలైతే మాత్రం మహేష్ బాబు బయటకి వచ్చే అవకాశం ఉండదు. మొత్తంగా ఆ సినిమాతోనే అక్యుఫై అవ్వాలి.

అందుకే మహేష్ బాబు తన అభిమానులతో మీటింగ్ లు, ఫ్యాన్ తో ఫోటోషూట్ లు ఈ గ్యాప్ లో పెట్టుకుంటారట.

మరోవైపు, ఈ సినిమాకి “మహారాజ్” అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు.

Advertisement
 

More

Related Stories