ఆ సినిమా జారిపోలేదంట

శ్రీలీల చాలా తొందరగా టాప్ హీరోయిన్ గా ఎదిగింది. కానీ ఒక్కసారిగా చేతిలో ఉన్న అన్ని సినిమాలు అయిపోయాయి. కొత్త సినిమాలు ఇప్పుడు రావడం లేదు. దాంతో, ఆమె కెరీర్ సంక్షోభంలో పడింది. అంతేకాదు, ఇంతకుముందు ఒప్పుకున్న సినిమా కూడా చేజారిపోయింది అని ఈ మధ్య ప్రచారం జరిగింది.

ఐతే, తాజా సమాచారం ప్రకారం ఆ సినిమా ఆమె చేతి నుంచి పోలేదు. నితిన్ హీరోగా దర్శకుడు వెంకీ కుడుముల తీస్తున్న “రాబిన్ హుడ్” చిత్రంలో ఆమె నటిస్తోంది. ఈ సినిమా నుంచి ఆమెని తొలగించలేదు. వేరే హీరోయిన్ని కూడా తీసుకోలేదు. ప్రస్తుతానికి ఈ సినిమాలో హీరోయిన్ శ్రీలీలనే.

నితిన్, శ్రీలీల గతేడాది “ఎక్స్ ట్రా ఆర్డినరీ” అనే సినిమాలో నటించారు. ఆ సినిమాలో శ్రీలీలకు పెద్దగా ప్రాధాన్యం లేదు. అలాగే సినిమా కూడా ఆడలేదు. దాంతో, ఆ సెంటిమెంట్ కారణంగా ఈ “రాబిన్ హుడ్” చిత్రం నుంచి శ్రీలీలని తప్పిస్తారని ప్రచారం జరిగింది. కానీ ఈ భామ ఇప్పటికే షూటింగ్ లో కూడా పాల్గొందట. కాబట్టి ఈ సినిమా ఆమె నుంచి వెళ్లిపోలేదు.

మరోవైపు, శ్రీలీల తన ఎంబీబీఎస్ పరీక్షలు కూడా రాయాలి. సో, ఒక ఆరు నెలల గ్యాప్ తీసుకొని ఫ్రెష్ గా కొత్త సినిమాలు ఒప్పుకుంటే బెటరని అంటున్నారు.

Advertisement
 

More

Related Stories