శంకరవరప్రసాద్ దసరాకు వస్తారంట

TeluguCinema 23 Sep 2025
Mana Sivashankara Vara Prasad

సంక్రాంతి పండక్కి రావాల్సిన “మన శంకరవరప్రసాద్ గారు” దసరా నుంచే సందడి చేయబోతున్నారు. ఈ మేరకు ఓ సర్ ప్రైజ్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. అనీల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి దసరాకు ఓ సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమా నుంచి ఇప్పటికే కొన్ని స్టిల్స్ రిలీజ్ అయ్యాయి. తాజాగా టైటిల్ కూడా రివీల్ చేశారు. ఇదే ఊపులో దసరాకు ఓ సింగిల్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాడు రావిపూడి. అయితే దీనిపై ఇంకా చిరంజీవి నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు.

సంక్రాంతి కోసం రెడీ చేస్తున్న సినిమా నుంచి ఇంత త్వరగా ఓ పాట రిలీజ్ చేస్తే, జనవరి సరికి పాతదైపోతుందనే ఫీలింగ్ కొందరికి ఉంది. మరి దీనిపై చిరంజీవి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

లిరికల్ వీడియో లేకపోయినా.. దసరాకు మరో రూపంలోనైనా సందడి చేయడం ఖాయం అంటోంది యూనిట్. వెరైటీ ప్రమోషన్స్ కు పెట్టింది పేరైన అనీల్ రావిపూడి, దసరా లాంటి ఫెస్టివల్ ను ఎందుకు వదులుకుంటాడు. కచ్చితంగా ఏదో ఒకటి ప్లాన్ చేసే ఉంటాడు. అదేంటో త్వరలోనే తెలుస్తుంది.