మనోజ్ పెళ్లి… దిష్టి పడకూడదనీ…

మంచు మనోజ్ రెండో పెళ్ళికి ముస్తాబు అయ్యాడు. ప్రముఖ రాజకీయ కుటుంబానికి చెందిన భూమా మౌనిక రెడ్డితో మంచు మనోజ్ పెళ్లి జరగనుంది. ఈ నెల 3న వీరి వివాహం జరగనుంది.

ఈ రోజు సంగీత్ వేడుక ఉంది. ఈ పెళ్లి గురించి ఈ రోజు అధికారిక ప్రకటన వచ్చింది.

తాజాగా మంచు మనోజ్ ఒక ఫోటో షేర్ చేశాడు. ఆ ఫొటోలో అతను ధరించిన షర్టుపై “May every evil eye go blind” అని ఉంది. “దిష్టి కళ్ళు అన్నీ గుడ్డివి అయిపోవాలి. ” అని దాని అర్థం.

ఇద్దరికీ ఇది రెండో వివాహమే. అతను ఆమె భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు. ఆమె తన భర్త నుంచి విడిపోయింది. పెళ్లి తర్వాత మనోజ్ మళ్ళీ నటనపై ఫోకస్ పెడుతాడట.

ఇదీ చదవండి: ఇండియన్-2 లేదు.. పాకిస్థాన్-3 లేదు: వెన్నెల కిషోర్

 

More

Related Stories