
మార్చి నెలలో పిల్లల పరీక్షలు ఉంటాయి. అందుకే, ఈ నెలలో సాధారణంగా సినిమాల జోరు తక్కువగానే ఉంటుంది. కోవిడ్ సంక్షోభం నుంచి కోలుకున్న చిత్రసీమ మళ్ళీ పాత పద్ధతుల్లోనే కొత్త సినిమాల విడుదల విషయంలో మార్చి నెలను పెద్దగా పట్టించుకోలేదు.
నాని హీరోగా నటించిన ‘దసరా’ మాత్రమే మార్చిలో విడుదల అవుతోన్న పెద్ద చిత్రం. ఇది కూడా మార్చి 30న విడుదల అవుతోంది. అంటే ఏప్రిల్ వేసవి సెలవుల కాలానికి బోణి కొడుతోంది ఈ మూవీ.
ఈ నెలకు బోణి కొడుతున్న చిత్రం…. బలగం (మార్చి 3). చిన్న చిత్రం ఇది. కమెడియన్ వేణు దర్శకుడిగా మారి తీసిన చిత్రం. ఆ తర్వాత చెప్పుకోదగ్గ చిత్రం…. ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి (మార్చి 17). అవసరాల దర్శకత్వంలో రూపొందిన ఈ రొమాంటికి కామెడీలో నాగ శౌర్య, మాళవిక నాయర్ హీరో, హీరోయిన్లుగా నటించారు.
Check out Release Dates of Telugu Films
ఉపేంద్ర నటించిన ‘కబ్జా’ సినిమా కూడా బరిలో ఉంది. ఇది పాన్ ఇండియా చిత్రం. ఇవి తప్ప మిగతావన్నీ అంచనాలు లేని చిత్రాలే.