ఆగని రీ-రిలీజుల వరద

రీ-రిలీజ్ అనేది ఒక వేలంవెర్రి అయిపొయింది. గొప్ప సినిమాలు మళ్ళీ విడుదల చెయ్యడం తప్పులేదు. కానీ ఐదారేళ్ళ క్రితం వచ్చిన సినిమాలను, పదేళ్ల క్రితం వచ్చిన సినిమాలను మళ్ళీ అప్ గ్రేడ్ చేసి విడుదల చేస్తున్నాం అని మేకర్స్ హడావిడి చేస్తున్నారు. దానికి అభిమానుల హంగామా కూడా ఉంది.
ఐతే, ఇందులో ఎన్ని విజయం సాధిస్తున్నాయి. లేదా డబ్బులు తెస్తున్నాయి అనేది పెద్ద ప్రశ్న. కొత్త సినిమాలు విడుదల అవుతున్న టైంలోనే ఈ రీ-రిలీజుల గోల ఎక్కువ అయి కొత్త సినిమాల వ్యాపారాన్ని దెబ్బ తీస్తున్న మాట వాస్తవం. గత నెలలో రాజమౌళి తీసిన రెండు బాహుబలి చిత్రాలను ఒకటిగా చేసి “బాహుబలి ఎపిక్” పేరుతో విడుదల చేశారు. దాంతో మొదటి రోజు ఫోకస్ అంతా దానిపైనే పడింది. అదే రోజు విడుదల కావాల్సిన రవితేజ మూవీ “మాస్ జాతర” ఒక రోజు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.
అయినా తెలుగు సినిమా పెద్దలు ఈ రీ-రిలీజ్ కల్చర్ ని ఆపడం లేదు. నిన్న రామ్ గోపాల్ వర్మ తీసిన కల్ట్ క్లాసిక్ “శివ” విడుదలయింది. ఇక చిరంజీవి కౌబాయ్ చిత్రం “కొదమసింహం” నవంబర్ 21 విడుదల కానుంది.
ఇదే నెలలో రీ-రిలీజ్ లకు సిద్ధంగా ఉన్న ఇతర చిత్రాలు…
కార్తీ చిత్రం ‘ఆవారా’
నువ్వొస్తానంటే నేనొద్దంటానా
సూర్య మూవీ ‘సికందర్’
బిజినెస్ మెన్