రామ్ పోతినేని ధీమా, కసి!

TeluguCinema 15 Nov 2025
Andhra King Taluka

రామ్ పోతినేని నటించిన రీసెంట్ మూవీస్ ఏవీ పెద్దగా ఆడలేదు. ఇంకా చెప్పాలంటే గత నాలుగేళ్ళల్లో ఒక్క హిట్ లేదు. మాస్ చిత్రాల మోజులో పది స్కంద, వారియర్, డబుల్ ఇస్మార్ట్ అంటూ ఏవేవో చేశారు. అన్నీ బ్యాడ్ రిజల్ట్ ఇచ్చాయి.

దాంతో ఇప్పుడు ట్రాక్ మార్చి కథాబలం ఉన్న సినిమా చేశాడు. అదే “ఆంధ్రా కింగ్ తాలూకా”. ఈ సినిమాలో అతను ఒక సూపర్ స్టార్ కి వీరాభిమానిగా నటిస్తున్నాడు. ఆ సూపర్ స్టార్ పాత్రని కన్నడ అగ్ర హీరో ఉపేంద్ర నటించాడు.

“ఈ సినిమా నా కెరీర్ లోనే కాదు తెలుగు సినిమా రంగంలోనే ఒక స్పెషల్ ఫిల్మ్ గా మిగులుతుంది. ఇది ఖచ్చితంగా చెప్పగలను,” అని తాజాగా భారీ స్టేట్ మెంట్ ఇచ్చాడు రామ్. ఇది నమ్మకమా? అతి నమ్మకమా? అని అడిగితే “చాలా కసిగా” ఈ సినిమాని రామ్ చేసాడని అంటున్నారు అతని టీం.

ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఈ సినిమాని చేశాడట. అందుకే అంతా ధీమా అని చెప్తున్నారు. ఈనెల 28న విడుదల కానుంది “ఆంధ్రా కింగ్ తాలూకా”.