‘ప్యారడైజ్’లో మోహన్ బాబు ఫిక్స్

నాని హీరోగా నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ (The Paradise) సినిమాలో కీలక పాత్రలో మోహన్ బాబు నటిస్తున్నారనేది ఓపెన్ సీక్రెట్. ఆన్ లొకేషన్ స్టిల్స్ లో కూడా ఆ విషయం బయటపడింది. అయితే ఈ విషయాన్ని అధికారికంగా మాత్రం ఇంకా ప్రకటించలేదు.
తాజాగా మంచు లక్ష్మి ఈ విషయాన్ని ప్రకటించేసింది. ‘ది ప్యారడైజ్’ సినిమాలో నాన్న నటిస్తున్నారని, చాలా ప్రత్యేకమైన పాత్ర పోషిస్తున్నారంటూ చాలా విషయాలు చెప్పేసింది.
ఆ వెంటనే నాలుక కరుచుకుంది. పొరపాటున చెప్పేశాను ఏం పర్లేదు కదా అంటూ పక్కనే ఉన్న మంచు మనోజ్ ను అడిగింది. ఇలాంటివి నీకు అలవాటే కదా అన్నట్టు మంచు మనోజ్ నవ్వేశాడు. ఆ వెంటనే కాస్త కవర్ చేసేలా మాట్లాడిన మంచు లక్ష్మి, నాని ఏం ఫీలవ్వడంటూ కవర్ చేసింది.
వచ్చే వారం మంచు లక్ష్మి సినిమా రిలీజ్ ఉంది. ఆ ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ, ఇలా ‘ది ప్యారడైజ్’ లో మోహన్ బాబు ఉన్న విషయాన్ని బయటపెట్టేసింది. ప్రస్తుతం చిన్న సినిమాలు థియేటర్లలో బాగా ఆడుతున్నాయని, తన సినిమా కూడా కచ్చితంగా ఆడుతుందని నమ్మకంగా చెబుతోంది ఈ సీనియర్ నటి.