- Advertisement -

కట్టుకున్న భర్తను డర్టీ ఫెలో అని తిట్టేసింది అనసూయ. అది కూడా పబ్లిక్ గా. అయితే ఇందులో సీరియస్ గా తీసుకోవాల్సిందేం లేదు. భర్తపై ఉన్న ప్రేమతోనే అనసూయ ఇలా రొమాంటిక్ గా రియాక్ట్ అయింది.
ఇంతకీ మేటర్ ఏంటంటే.. రీసెంట్ గా ఓ కార్యక్రమంలో పాల్గొంది అనసూయ. ఆ కార్యక్రమంలో అనసూయకు తెలియకుండా, ఆమె భర్త వీడియోను రికార్డ్ చేసి ప్రసారం చేశారు. అందులో అనసూయకు సంబంధించి ఓ సీక్రెట్ ను బయటపెట్టేశాడు ఆమె భర్త భరధ్వాజ్.
బయటకు రెబల్ గా కనిపించే అనసూయ చాలా ఎమోషనల్ అంట. ప్రతి చిన్న విషయానికి ఇట్టే ఏడుపు ముఖం పెట్టేస్తుందట. చివరికి హెయిర్ పిన్ కనిపించకపోయినా ఏడ్చేస్తుందట. తనకు సంబంధించిన ఓ మేటర్ ను భరధ్వాజ్ ఇలా బయటపెట్టేసరికి.. అనసూయ రొమాంటిక్ గా తన భర్తను డర్టీ ఫెలో అని తిట్టేసింది.