కన్ఫ్యూజన్లో నాగ్ అశ్విన్!

నాగ్ అశ్విన్ దర్శకుడిగా చాలా పెద్ద హిట్ అందుకున్నాడు. వెయ్యి కోట్ల సినిమా డెలివరీ చెయ్యడం అంటే మాటలు కాదు. “కల్కి 2898 AD” చిత్రంతో అంతటి విజయం అందుకున్నాడు. ఐతే అంత పెద్ద హిట్ ఇచ్చినా ప్రభాస్ ఎందుకో రెండో పార్టుపై తాత్సరం చేస్తున్నారు.
నాగ్ అశ్విన్ లేటెస్ట్ గా ఒక పాడ్ కాస్ట్ లో తన సినిమాల గురించి మాట్లాడాడు. “కల్కి 2” ఎప్పుడు అని అడిగితే సమాధానం చెప్పలేక ఇబ్బంది పడ్డాడు. ఈ ఏడాది చివర్లో స్టార్ట్ చెయ్యాలనేది ప్లాన్ అని అంటున్నాడు. ఐతే, ఆయన ప్లాన్ చేసినా ప్రభాస్ డేట్స్ ఇవ్వాలి, ఒప్పుకోవాలి. అది సాధ్యం అయ్యేలా లేదు.
ప్రభాస్ వచ్చే ఏడాది కూడా కల్కి 2కి డేట్స్ ఇవ్వకపోతే ఏమి చెయ్యాలి అనే విషయంలో కూడా నాగ్ అశ్విన్ కి క్లారిటీ లేదు. ఐతే, రజినీకాంత్ మాత్రం ఒక సినిమా చేస్తాను అని మాట ఇచ్చారట. నాగ్ అశ్విన్ మామయ్య, ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ … రజినీకాంత్ తో మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. అశ్వినీ దత్ కి ఒక సినిమా చేస్తాను అని రజినీకాంత్ మాట ఇచ్చారు. సో, నాగ్ అశ్విన్ కథ రెడీ చేస్తే అది కుదిరే అవకాశం ఉంది.
ఐతే, ‘కల్కి 2’ని మాత్రం పక్కనపెట్టలేడు నాగ్ అశ్విన్.