ప్రకాష్ రాజ్ కి బాసటగా నాగబాబు

TeluguCinema 06 Oct 2021
MAA Elections

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో అధ్యక్షుడిగా నిలబడ్డ ప్రకాష్ రాజ్ ప్యానెల్ కే మెగాస్టార్ చిరంజీవి మద్దతు ఉందని నాగబాబు చెప్పారు. ఇప్పటివరకు చిరంజీవి బయటికి వచ్చి మాట్లాడలేదు. ఈ నేపథ్యంలో బుధవారం నాగబాబు ప్రెస్ మీట్ పెట్టి చిరంజీవి సపోర్ట్ ప్రకాష్ రాజ్ కి ఉందని తేల్చి చెప్పారు.

అలాగే, ఈ ఎన్నికల్లో గెలిచేందుకు కొందరు ఓటుకి పదివేలు చొప్పున ఇస్తున్నారని నాగబాబు ఆరోపించారు.

“ప్రకాష్ రాజ్ లేకుండా సినిమాలు రూపొందవు. పెద్ద చిత్రాల్లో నటిస్తారు, చిన్న సినిమాలూ చేస్తారు. ఆయన ఎలాంటి పాత్ర ఇచ్చినా అదరగొడుతారు. జాతీయస్థాయి నటుడు ప్రకాష్ రాజ్. అలాంటి బిజీ ఆర్టిస్ట్ “మా” కోసం కొంతకాలం సినిమాలు కూడా తగ్గించుకొని పనిచేస్తాను అని చెప్పినప్పుడు ఆనందం వేసింది. అందుకే మేమంతా అతని వెంట నిలబడుతున్నాం,” అన్నారు నాగబాబు.

విష్ణు గురించి ఎక్కడా ప్రస్తావన తేలేదు నాగబాబు. కాకపోతే, డబ్బులతో ప్రలోభాలు పెడుతూ “మా” ప్రతిష్టని మసకబారుస్తున్నారని ఆరోపణలు చెయ్యడం విశేషం. విష్ణు ప్యానెల్లో ఉన్నవారిపై మాత్రం విమర్శల బాణాలు విసిరారు.

మెగాస్టార్ చిరంజీవి బయటికి వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదని, ఆయన ఎవరి పక్షమో అందరికి తెలుసు కదా అని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు నాగబాబు. చిరంజీవితో పాటు దాదాపు పెద్ద హీరోలు అందరూ ప్రకాష్ రాజ్ వైపు ఉన్నారని ఆయన హింట్ ఇచ్చారు.

TeluguCinema

View all posts

Recent News