బాలయ్య సినిమాకి ముహూర్తం

TeluguCinema 02 Oct 2025
Balakrishna

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ఇంతకుముందు “వీర సింహా రెడ్డి” చిత్రం వచ్చింది. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ కుదిరింది. ఈ నెల 24న సినిమాని మొదలు పెడుతున్నారు.

ఇది బాలయ్య కెరీర్ లో 111వ చిత్రం. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని (#NBK111) అక్టోబర్ 24న లాంచ్ చేస్తున్నారు. ఈ సినిమా చారిత్రక నేపథ్యంగా సాగుతుందట. వృద్ధి సినిమాస్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా “పెద్ది” మూవీని తీస్తున్న ఈ నిర్మాణ సంస్థ బాలయ్య కెరీర్ లోనే కాస్ట్లీ మూవీగా నిర్మిస్తోందట.

బాలయ్య ఈ సినిమాలో రాజుగా కనిపిస్తారని టాక్.

“అఖండ 2” తర్వాత బాలయ్య చేసే చిత్రమిదే. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో ఒక మూవీ చేసే అవకాశం ఉంది.