కామ్రేడ్ కళ్యాణ్ గా శ్రీ విష్ణు

ఇటీవల “సింగిల్” అనే సినిమాతో మళ్ళీ విజయం అందుకున్నాడు శ్రీ విష్ణు. దాంతో అతనికి వరుస పెట్టి ఆఫర్లు వస్తున్నాయి. లైన్లో ఇప్పటికే మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి. తాజాగా “కామ్రేడ్ కళ్యాణ్” అనే మరో సినిమా ప్రకటించాడు.
ఈ సినిమా టైటిల్ తో పాటు మొదటి లుక్ పోస్టర్ వచ్చింది. శ్రీ విష్ణు పోస్టర్ లో నక్సలైట్ అవతారంలో కనిపించడం విశేషం.
ఈ సినిమాలో మహిమా నంబియార్ హీరోయిన్ గా నటిస్తోంది. జానకిరామ్ మారెళ్ల ఈ సినిమాకి దర్శకుడు.
టైటిల్ సీరియస్ గా అనిపించినప్పటికీ, ఇది పూర్తి ఎంటర్ టైనర్ అని మేకర్స్ అంటున్నారు. కామ్రేడ్ కళ్యాణ్ ఒక నవ్వుల హరివిల్లుగా ఉంటుందట. శ్రీ విష్ణు రెండు విభిన్నమైన లుక్స్ లో కనిపిస్తాడు ఇందులో
రాధిక శరత్ కుమార్, షైన్ టామ్ చాకో మరియు ఉపేంద్ర లిమాయే కీలక పాత్రలు పోషిస్తున్నారు.