కొత్త ఇంట్లోకి వెళ్లనున్న బాలయ్య?

Nandamuri Balakrishna

జూబ్లీహిల్స్ మెయిన్ రోడ్ లో ఉన్న భవంతిలో నందమూరి బాలకృష్ణ నివసిస్తారు అని అందరికీ తెలుసు. ఆయన ఇల్లు రోడ్ నంబర్ 45కి ఒక ల్యాండ్ మార్క్. హైదరాబాద్ కి సినిమా పరిశ్రమ పూర్తిగా షిఫ్ట్ అయినప్పటి నుంచి బాలయ్య ఆ ఇంట్లోనే ఉంటున్నారు. ఐతే, ఇప్పుడు బాలయ్య కొత్త ఇంట్లోకి షిఫ్ట్ కానున్నారు అని టాక్.

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఉన్న ఇంటికి ఒక సమస్య వచ్చిపడింది. ఆ ఏరియా మొత్తం బిజీ ఏరియాగా మారింది. ట్రాఫిక్ ఆంక్షలు ఎక్కువ అయ్యాయి. పైగా ఆ ఇల్లు సరిగ్గా మూడు రోడ్ల కూడలిలో ఉంది.

అందుకే, కొంచెం ప్రశాంతంగా ఉండే ఏరియాకి షిఫ్ట్ అవ్వాలనే ఉద్దేశంతో జూబ్లీహిల్స్ లోనే మరో ప్రాంతంలో కొత్త ఇల్లు కట్టిస్తున్నారట. నిర్మాణం పూర్తి కాగానే అటు షిఫ్ట్ అవుతారని టాక్.

మరోవైపు, బాలయ్య సంపాదన ఇప్పుడు బాగుంది గతంతో పోల్చితే. మూడేళ్ళ క్రితం బాలయ్య సినిమాకి 10 కోట్లు తీసుకునేవారు. ఇప్పుడు 27 కోట్లకు చేరింది ఆయన పారితోషికం. అలాగే, “అన్ స్టాపబుల్” షో, బ్రాండ్స్ ద్వారా కూడా మంచి ఆదాయం వస్తోంది.

Advertisement
 

More

Related Stories