రవితేజని మించిన నాని!

Nani


స్పీడ్ గా సినిమాలు చెయ్యడంలో రవితేజని మించినోడు లేడు అంటారు. నిజమే ఒకప్పుడు ఏడాదికి రెండు సినిమాలు విడుదల చేసి, మరోటి సెట్ మీద ఉంచి తన దూకుడు ఎలా ఉంటుందో చూపించేవారు. ఇప్పుడు రవితేజని మించిపోయాడు నాని. ఈ ఏడాది “దసరా” సినిమాని విడుదల చేసిన నాని తాజాగా “హాయ్ నాన్న” అనే సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేశారు. ఈ క్యాలెండర్ ఇయర్ పూర్తి కావడానికి ఇంకా మూడు నెలల సమయం మిగిలే ఉంది.

సో, ఈ గ్యాప్ లో మరో రెండు సినిమాలు సెట్ మీదకి తీసుకెళ్లేలా అంతా సిద్ధం చేసుకుంటున్నారు నాని.

దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో ఇప్పటికే “అంటే సుందరానికి” అనే సినిమా చేసిన నాని తాజాగా మరోటి చెయ్యనున్నారు. ఈ సినిమాకి దానయ్య నిర్మాత. ఈ నెలలలోనే షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఇక, డిసెంబర్ లో తమిళ దర్శకుడు సీబీ చక్రవర్తి దర్శకత్వంలో మరో సినిమాని లాంచ్ చేస్తారట.

ఈ రెండు చిత్రాలు కూడా వచ్చే ఏడాది విడుదల అవుతాయి. ఇవి కాకుండా ఇంకా మరో సినిమా కూడా సెట్ పైకి వచ్చే ఏడాది తీసుకెళ్తారట.

Advertisement
 

More

Related Stories