నానితోనే సినిమా!

Nani

నాని హీరోగా ఒక తమిళ దర్శకుడితో సినిమా ప్లాన్ చేశారు నిర్మాత శ్రీనివాస చిట్టూరి. తాజాగా “నా సామి రంగ” తీసిన శ్రీనివాస చిట్టూరి తదుపరి చిత్రంగా నానితో ఒక మూవీ అనుకున్నారు. ఒక తమిళ్ దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో అతనిని నాని దగ్గరికి తీసుకెళ్లి ప్రాజెక్ట్ సెట్ చేయించారు. కానీ అది ఇప్పుడు ఆగిపోయింది.

ఆ సినిమా ఆగిపోయిన తమ తదుపరి చిత్రం మాత్రం నానితోనే ఉంటుంది అని అంటున్నారు శ్రీనివాస చిట్టూరి.

తమిళ దర్శకుడు సిబి చక్రవర్తి చెప్పిన కథ నానికి కూడా నచ్చింది. ఐతే, బడ్జెట్ లెక్కలు నిర్మాతతో మాట్లాడుకోమని చెప్పాడట నాని. ఆ దర్శకుడు తమకు చెప్పిన బడ్జెట్ విని నిర్మాత షాక్ తిన్నారు. నానితో ప్లాన్ చేసిన ఈ సినిమాకి ఆ దర్శకుడు ఏకంగా 100 కోట్లపైనే పేపర్ మీద వేసి చెప్పాడట. ఇక తీరా సెట్ కి వెళ్లిన తర్వాత మరో 20, 30 పెరుగుతుంది అని గ్రహించారు నిర్మాత. దాంతో, అతన్ని చెన్నైకి పంపించేసి ఇప్పుడు వేరే సినిమా అనుకుంటున్నారు.

మంచి దర్శకుడు సెట్ కాగానే నానితోనే మా తదుపరి చిత్రం ఉంటుంది. ప్రస్తుతం ఆ పనిలో ఉన్నారు.

Advertisement
 

More

Related Stories