చేవెళ్ల దుర్ఘటన: ప్రకటనలు వాయిదా

TeluguCinema 03 Nov 2025
Meenakshi Chaudhary and Nayanthara

తెలంగాణలోని చేవెళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 19 మంది ఆర్టీసీ బస్సు ప్రయాణికులు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన నేపథ్యంలో పలు సినిమాల ప్రకటనలు, పోస్టర్ విడుదలలు వాయిదా పడ్డాయి.

నందమూరి బాలకృష్ణ – గోపీచంద్ మలినేని సినిమాకి సంబంధించిన ప్రకటన ఈ రోజు రావాలి. కానీ ఈ ప్రమాద ఘటన నేపథ్యంలో మృతుల కుటుంబాలకు నివాళి అర్పిస్తూ టీం తమ ఆలోచనని విరమించుకొంది. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. రేపు ఆ ప్రకటన చేస్తారు. గోపీచంద్ మలినేని – బాలయ్య కాంబినేషన్ లో ఇంతకుముందు “వీర నరసింహా రెడ్డి” సినిమా వచ్చింది, విజయవంతం అయింది. ఇప్పుడు మరో కొత్త సినిమా ప్రారంభం కానుంది.

ఇక హీరోయిన్ మీనాక్షి చౌదరి పోషిస్తున్న పాత్ర ఫోటోని, పోస్టర్ ని ఈ రోజు విడుదల చేద్దామనుకున్నారు నాగచైతన్య కొత్త చిత్రం నిర్మాతలు. కానీ అది ఈ ప్రమాద ఘటన కారణంగా వాయిదా వేశారు.

నాగచైతన్య హీరోగా “విరూపాక్ష” తీస్తున్న కొత్త చిత్రాన్ని బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది.