వారిది ఆరేళ్ళ బంధం!

Nayan and Vignesh


నయనతార, దర్శకుడు విగ్నేష్ శివన్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనేది తెలిసిన మేటరే. ఇప్పటికే ఇద్దరూ రింగులు మార్చుకున్నారు. అఫీషియల్ గా ఎంగెజెడ్ అయ్యామని మొన్న నయనతార బయటపెట్టింది. ఇక ఈ రోజు వారు తమ 6వ ‘డేటింగ్ యానివర్సరీ’ జరుపుకున్నారు.

అంటే ఆరేళ్ళ క్రితం వీరి డేటింగ్ మొదలైందట. విగ్నేష్ కొన్ని ఫోటోలను లేటెస్ట్ గా షేర్ చేశారు.

విగ్నేష్ తీసిన ‘నేనూ రౌడీనే’ అనే సినిమాలో నయనతార నటించింది. సగం షూటింగ్ కాగానే పీకల్లోతు ప్రేమలో పడిపోయారట.అలా మొదలైన ప్రేమాయణం ఇప్పుడు పరిణయం వరకు వచ్చింది.

పెళ్ళికి ముందే కలిసి పూజలు చేస్తున్నారు. గుళ్ళు తిరుగుతున్నారు. ఎంగేజ్ మెంట్ అయిపోయింది అంటే ఆల్మోస్ట్ భార్యాభర్తలు అయినట్లే కదా. అందుకే, ఈ జంట తమ డేటింగ్ యానివర్సరీలను కూడా జరుపుకుంటోంది. ఇక పెళ్లి ఐతే అన్ని వెడ్డింగ్ యానివర్సరీలే.

Advertisement
 

More

Related Stories