చెర్రీ, సుక్కూపై క్రేజీ గాసిప్

కొన్ని పుకార్లు వినడానికి చాలా బాగుంటాయి. ఇది కూడా అలాంటిదే. చరణ్ తో సుకుమార్ ఓ సినిమా చేయబోతున్నాడనేది గాసిప్ కాదు. అయితే ఆ సినిమా కథపై ఇప్పుడు చాలా పెద్ద గాసిపింగ్ నడుస్తోంది. అదే ‘రంగస్థలం-2’.
అవును.. రామ్ చరణ్ కోసం ‘రంగస్థలం-2’ కథ సిద్ధం చేస్తున్నాడట సుకుమార్. త్వరలోనే ఈ కథ బేసిక్ వెర్షన్ ను చరణ్ కు వినిపిస్తాడట. చరణ్ ఓకే చెబితే, ఇక మిగతా పని మొదలవుతుంది.
‘రంగస్థలం’ కూడా ఓపెన్ ఎండ్ సినిమానే.
ప్రకాష్ రాజ్ పాత్రను చంపేసిన తర్వాత చరణ్-సమంత అలా నడుచుకుంటూ వెళ్లిపోయే సన్నివేశం దగ్గర ఎండ్ కార్డు పడుతుంది. అక్కడ్నుంచి మరో కథను నడిపించడానికి కావాల్సినంత స్కోప్ ఉంది.
సరిగ్గా ఈ పాయింట్ పట్టుకున్నాడట సుకుమార్. పైగా ‘పుష్ప’ సినిమాకు సీక్వెల్ తీసిన అనుభవం ఎలాగూ ఉంది కాబట్టి, ‘రంగస్థలం-2’ రావడం పక్కా అంటున్నారు మెగా ఫ్యాన్స్. మరికొన్ని రోజుల్లో ఈ రూమర్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.