ప్రతి సినిమా ఒక పాఠమే: నిధి అగర్వాల్

Nidhhi Agerwal

మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం అవుతున్న మూవీ… ‘హీరో’. నిధి అగర్వాల్ హీరోయిన్ గా న‌టించింది. జనవరి 15న విడుదల కాబోతున్న ఈ మూవీ గురించి నిధి అగర్వాల్ తో చిట్ చాట్.

శ్రీ‌రామ్ ఆదిత్య చెప్పిన కథ నచ్చింది. కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడిన ఆఫ్ బీట్ చిత్రం …హీరో. పెద్ద హీరోనా, కొత్త హీరోనా అనేది చూడను. కథ, ప్రాజెక్ట్ నచ్చాలి. అందుకే ‘హీరో’ ఒప్పుకున్నాను. కొత్త హీరో గ‌ల్లా అశోక్ నటుడిగా ప్రిపేర్ అయి అడుగుపెట్టాడు. మొదటి సినిమాలోనే గ‌ల్లా అశోక్ బాగా న‌టించాడు.

ఇందులో నా పాత్ర పేరు సుబ్బు. డాక్టర్ గా నటించాను. నా ఫాద‌ర్‌గా జ‌గ‌ప‌తిబాబు గారు నటించారు.

ఇస్మార్ట్ శంక‌ర్ త‌ర్వాత తమిళం, హిందీ చిత్రాలు చేశాను.

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ‘హరి హర వీరమల్లు’ చిత్రం చేయ‌డం అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన పెద్ద స్టార్. కానీ చాలా కూల్‌గా వుంటారు.

Nidhhi Agerwal

నేను పుట్టింది హైద‌రాబాద్‌లోనే. తెలుగు ప‌రిశ్ర‌మ అంటేనే చాలా ఇష్టం.

‘ఇస్మార్ట్ శంకర్’ చేశాక గ్లామ‌ర్ హీరోయిన్ అనే ఇమేజ్ వచ్చింది. అది నాకు కలిసొచ్చింది.

టాలీవుడ్ లో అల్లు అర్జున్‌, రామ్ చ‌ర‌ణ్‌, ఎన్‌.టి.ఆర్‌. జూనియ‌ర్ ఇష్టమైన యాక్టర్స్.


సినిమా సినిమాకూ చాలా నేర్చుకుంటున్నా. ఎందుకంటే డిఫ‌రెంట్ ద‌ర్శ‌కులు ఆలోచ‌న‌లు, ఏదో ఒక‌టి నేర్చుకునేలా వుంటుంది.

ఓటీటీ ప్రాజెక్టులు ఒప్పుకోవడం లేదు. సినిమాలకే నా ఓటు.

నేను సోష‌ల్ మీడియా బాగా హెల్ప్ చేసింది. నేను హీరోయిన్ గా పరిచయం కాకముందే నాకు ఇన్ స్టాగ్రామ్ లో ఫాలోయింగ్ వచ్చింది. ఇప్పుడు ఇంకా ఫాలోవర్స్ వచ్చారు. నేను పోస్ట్ చేసే ఫోటోల వల్ల నాకు అవకాశాలు కూడా వచ్చాయి. ఐతే, కొందరు ఆ ఫోటోలకు ఘోరంగా కామెంట్స్ పెడుతారు. వాటిని ప‌ట్టించుకోవడం మానేశా.

తెలుగులో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు త‌ర్వాత ఇంకా ఏదీ సైన్ చెయ్యలేదు. హిందీలో ఒకటి, త‌మిళంలో ఉద‌య‌నిధి స్టాలిన్‌తో సినిమా చేశాను.

నేను పూర్తి శాఖా హారిని. ఇడ్లీ అంటే చాలా ఇష్టం.

ఆ మధ్య కొంచెం లావు అయ్యాను. మళ్ళీ కొత్త సినిమా కోసం తగ్గుతున్నాను.

Advertisement
 

More

Related Stories