ప్రేమలో పడతానేమో: నిధి

Nidhii Agerwal

హీరోయిన్ నిధి అగర్వాల్ తన లైఫ్ స్టేటస్ పై రియాక్ట్ అయింది. ప్రస్తుతం సింగిల్ గానే ఉన్నానంటున్న ఈ ముద్దుగుమ్మ.. రాబోయే రోజుల్లో ప్రేమలో పడినా ఆశ్చర్యపోనక్కర్లేదంటోంది. న్యూ నార్మల్ కు మెల్లగా అలవాటుపడుతూ ఇప్పుడిప్పుడే షూటింగ్స్ కు హాజరవుతున్న ఈ బ్యూటీ.. ఏమంటోందో చూద్దాం..

7 నెలల లాక్ డౌన్ తర్వాత చేసిన ట్రావెలింగ్ అనుభవం ఎలా ఉంది?

నిజం చెప్పాలంటే చాలా భయం వేసింది. మా నాన్న నాకు ధైర్యం చెప్పి స్వయంగా లొకేషన్ లో డ్రాప్ చేశారు. మొదటి రోజు స్కూల్ కు వెళ్లినప్పుడు పేరెంట్స్ ఎలాగైతే వస్తుంటారో అది నాకు గుర్తొచ్చింది. నాన్న ఉండడం చాలా ధైర్యం వచ్చింది. ఇక న్యూ-నార్మల్ లో భాగంగా మాస్కులు, శానిటైజర్లు అంతా వాడాం

న్యూ నార్మల్ కు ఎలా అలవాటు పడ్డారు?

నా చుట్టుపక్కల జనాలు ఎలా ఉన్నారో ముందుగా గమనించాను. వాళ్లు ఏం చేస్తున్నారో చూశాను. సేఫ్ గా ఉండడం కోసం వాళ్లు ఏం చేస్తున్నారో చూసి నేర్చుకున్నాను. ఎందుకంటే ఇన్నాళ్లూ ఇంట్లో ఉన్నాను. అలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం నాకు రాలేదు. షూట్ ఉంది కాబట్టి బయటకు వచ్చాను. తప్పనిసరి అయితే తప్ప బయటకు రావొద్దు, ఇంట్లోనే ఉండండి

మళ్లీ లొకేషన్ పైకి రావడం ఎలా ఉంది?

చాలా ఎగ్జయిటింగ్ గా ఉంది. నేను కొన్ని సినిమాలు పూర్తిచేయాల్సి ఉంది. మరికొన్ని కొత్త సినిమాలు స్టార్ట్ చేయాలి. ఎప్పుడూలేని విధంగా నా పేరెంట్స్ నాకు రోజూ ఫోన్ చేస్తున్నారు. ధైర్యం చెబుతున్నారు. అది నాకు కొండంత భరోసా.

రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతున్నారు?

ఇప్పటికే మాస్క్, శానిటైజర్ వాడుతున్నాను. టైమ్ దొరికినప్పుడల్లా ఆవిరి కూడా పడుతున్నాను. ఇకపై నాన్-స్టాప్ గా వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. న్యూ నార్మల్ కు పూర్తిగా అలవాటుపడ్డాను.

సింగిల్ గానే ఉంటారా..? ఇంకేమైనా ప్లాన్స్ ఉన్నాయా?

ఈ లాక్ డౌన్ టైమ్ లో చాలామంది పెళ్లిళ్లు చేసుకున్నారు. కొంతమంది గర్భవతులు కూడా అయ్యారు. మరికొంతమంది పెళ్లిళ్లకు రెడీ అవుతున్నారు. అవన్నీ వింటుంటే చాలా ఆనందంగా అనిపిస్తోంది. ఈ లాక్ డౌన్ టైమ్ లో మనకేది ముఖ్యం అనే విషయాన్ని అంతా తెలుసుకున్నారు. నేనైతే ప్రస్తుతానికి సింగిల్. ఇలానే చాలా హ్యాపీగా ఉన్నాను. ప్రేమ-పెళ్లి అనేవి ప్రస్తుతానికి లేవు కానీ, భవిష్యత్తులో కచ్చితంగా ఉంటాయనే విషయం నాకు తెలుసు. వాటిని కాదనలేం కదా.

Advertisement
 

More

Related Stories