- Advertisement -

నిహారిక పెళ్లి డిసెంబర్ లో. హైదరాబాద్ లోని ఒక ఎమ్మెన్సీ కంపెనీలో పనిచేసే చైతన్య జొన్నలగడ్డతో ఆమె పెళ్లి ఫిక్స్ అయింది. ఇటీవలే ఎంగేజ్ మెంట్ కూడా జరిగింది.
ఇక పెళ్లి ముహూర్తంలోపు మంచి ఫిట్నెస్ సాధించాలని నిహారిక జిమ్ లో కష్టపడుతోందట. ఆమె జిమ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నిహారిక స్లిమ్ గానే ఉంటుంది. కానీ ఇంకా ఫిట్ గా ఉండాలని కసరత్తులు చేస్తున్నట్లుంది. అన్నట్లు, ఈ భామ ఇక సినిమాలకు గుడ్ బై చెప్పనుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా ఆక్టివిటీ తగ్గించింది.
తమిళంలో ఇంతకుముందు ఒప్పుకున్న సినిమాల నుంచి తప్పుకొంది నిహారిక.
26 ఏళ్ల నిహారిక టీవీ యాంకర్ గా, హీరోయిన్ గా కనిపించింది. ఐతే, హీరోయిన్ గా ఆమె నటించిన సినిమాలేవీ విజయం సాధించలేదు.