నిఖిల్ పాన్ ఇండియా మూవీ అప్ డేట్స్

TeluguCinema 22 May 2022
nikhil spy 220522

కెరీర్ లో ఫస్ట్ టైమ్ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు నిఖిల్. ఆ సినిమా పేరు స్పై. నిఖిల్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా వస్తోంది ఈ సినిమా. ఎప్పటికప్పుడు మూవీ అప్ డేట్స్ అందిస్తున్న యూనిట్, తాజాగా సినిమా స్టేటస్ ను బయటపెట్టింది.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి భారీ యాక్షన్ ఎపిసోడ్ పిక్చరైజ్ చేస్తున్నారు. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ లీ విటేకర్ పర్యవేక్షణలో భారీ యాక్షన్ సీన్స్ తీస్తున్నారు. ఇందులో నిఖిల్ తో పాటు బాలీవుడ్ నటుడు మకరంద్ దేశ్‌పాండే, అభినవ్ గోమతం, ఐశ్వర్యా మీనన్, సన్యా ఠాకూర్‌లు కూడా పాల్గొంటున్నారు. ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ దాదాపు 70శాతం పూర్తవుతుందని మేకర్స్ ప్రకటించారు.

nikhil spy 220522 2

గూఢచారి, ఎవరు, హిట్ లాంటి సూపర్ హిట్ చిత్రాలకు ఎడిటర్ గా చేసిన గ్యారీ బిహెచ్ ఈ సినిమాతో దర్శకుడిగా మారాడు. ఎడ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పై కె. రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు కథ కూడా ఇతడే అందించడం విశేషం.

ఇటీవల విడుదలైన ఈ సినిమా టైటిల్ పోస్టర్ ఆసక్తిని రేకెత్తించింది. తన మొదటి పాన్ ఇండియా చిత్రంగా విడుదల కాబోతున్న ‘స్పై’లో సరికొత్త లుక్, భిన్నమైన పాత్రలో అలరించనున్నారు నిఖిల్. శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకు సంగీత దర్శకుడు.

తెలుగు, హిందీ, తమిళం, కన్నడ ,మలయాళ భాషల్లో 2022 దసరాకు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.

TeluguCinema

View all posts

Recent News