108 సూర్యనమస్కార ఆసనాలు

యోగ … మన దైనందిన జీవితాన్ని అద్భుతంగా మలచుకునే ఒక వరం. భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప బహుమతి. అందుకే జూన్ 21న యోగా డే జరుపుకుంటున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ యోగ డేని బాగా పాపులర్ చేశారు.
యోగా డే సందర్భాన్ని పురస్కరించుకొని సైనిక్ పురి లో కొత్తగా ప్రారంభమయిన “నిర్వాణ యోగా స్టూడియో” ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వహించింది.
12 సూర్య నమస్కార ఆసనాలను 108 సార్లు ఏకబిగిన సామూహికంగా చేయటం అనేది ఈ కార్యక్రమం. యువతీయువకులతో పాటు నడివయస్కులు, పెద్దవాళ్ళూ పాల్గొని సూర్యనమస్కారాలు చేయడం విశేషం.
“సూర్య నమస్కారాలను ఇలా 108 సార్లు ఏకబిగిన చేయటంవల్ల యోగసాధకులకు శారీరక, మానసిక శక్తి లభించటమేగాక కండరాలలో బలం, పటుత్వం, సాగేతత్వం, కదలికలో వేగం పెరుగుతుంది. తద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నిత్యం ఉత్సాహంగా ఉంటారు, ” అని స్టూడియో ఓనర్ వెంకట్ అంటున్నారు..
ఇతర వివరాలకు 7093029292, 8919037303 కాల్ చేసి సంప్రదించవచ్చు ….!