పునీత్ ‘జేమ్స్’కి పోటీ లేదు


కన్నడ స్టార్ పునీత్‌ రాజ్‌కుమార్‌ నటించిన చివరి చిత్రం …జేమ్స్. ఈ సినిమా వచ్చే నెల విడుదల కానుంది. రిపబ్లిక్ డేని పురస్కరించుకొని ఈ సినిమా మొదటి లుక్ ని విడుదల చేశారు. సైనికుడి గెటప్ లో పునీత్ రాజ్ కుమార్ కనిపించడంతో ఆయన అభిమానులు ఉద్వేగంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

కన్నడ సినిమా రంగంలో పవర్ స్టార్ గా వెలుగొందిన పునీత్ గతేడాది అక్టోబర్ 29న గుండెపోటుతో కన్నుమూశారు.

మార్చి17న పునీత్ పుట్టిన రోజున ‘జేమ్స్’ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. దాంతో, మార్చి 17 నుంచి ఒక వారం రోజులు ఇతర సినిమాలు విడుదల చేయకూడదని కన్నడ డిస్ట్రిబ్యూటర్లు నిర్ణయించుకున్నారు. ఇది తాము పునీత్ కి ఇచ్చే నివాళి అని వారు పేర్కొన్నారు.

పునీత్ చివరి చిత్రాన్ని ఘన విజయం చెయ్యాలని అభిమానులు ఫిక్స్ అయ్యారు. కన్నడ సినిమా ఇండస్ట్రీ అంతా ముందుకు వచ్చి ఆ సినిమా మేకర్స్ కి సపోర్ట్ ఇస్తున్నారు.

Advertisement
 

More

Related Stories