ప్రభాస్ ఆ మాటలో నిజం లేదు!

“పెళ్లి అంటూ చేసుకుంటే ఇక్కడే తిరుపతిలో చేసుకుంటా” అని ప్రభాస్ తన అభిమానులకు తెలిపారు. ఈ మాట ఆయన “ఆదిపురుష్” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పడం, అది వైరల్ కావడం చకచకా జరిగిపోయాయి.

ఇప్పుడు ఈ విషయంలో క్లారిటీ వచ్చింది. ప్రభాస్ కి పెళ్లి ఆలోచన ఏమి లేదు. కేవలం అభిమానులు అడిగారని ‘చేసుకోవాలి అనిపిస్తే ఇక్కడ చేసుకుంటా’ అనే అర్థంలో చెప్పారు తప్ప కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అని అనలేదు అని ప్రభాస్ టీం చెప్తోంది. అంటే, అభిమానుల ఆనందం కోసం ఓ మాట అన్నారు. అంతే కానీ, ఆయనకి పెళ్లి ఆలోచన లేదిప్పుడు.

“ప్రభాస్ పెళ్లి” అనే టాఫిక్ దాదాపుగా 12 ఏళ్ల నుంచి ఎప్పుడూ మీడియాలో ఒక వార్తే. అభిమానులు కూడా ఆ విషయాన్ని అడగకుండా ఉండడం లేదు. ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు ఇంతకుముందు ఈ విషయం మాట్లాడుతుండేవారు. “ప్రభాస్ పెళ్లి త్వరలోనే అంటూ” మీడియాకి, అభిమానులకు చెప్తుండేవారు. ఇప్పుడు ఆయన లేరు. సో, ప్రభాస్ అందుకే అభిమానుల ఆనందం కోసం ఇక్కడ చేసుకుంటాలే అని ఊరుకున్నారు.

ప్రభాస్ చేసిన మరో ప్రామిస్ మాత్రం నిజమే. “మునుపటిలా కాదు ఇకపై ప్రతి ఏడాది రెండు సినిమాలు విడుదల చేస్తాను,” తిరుపతి వేదికపై నుంచి అభిమానులకు మాటిచ్చారు ప్రభాస్. ఈ ఏడాది ‘ఆదిపురుష్’, ‘సలార్’ విడుదల అవుతాయి. వచ్చే ఏడాది ‘మారుతి మూవీ’, ‘ప్రాజెక్ట్ కే’ విడుదల అవుతాయి.

Advertisement
 

More

Related Stories