​OG: ఇండియాలోనే 100 కోట్లు

TeluguCinema 27 Sep 2025
OG glimpse

పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అతిపెద్ద ఓపెనింగ్ తెచ్చుకున్న చిత్రంగా నిలిచింది “ఓజి.” సెప్టెంబర్ 24న ప్రీమియర్ షోలతోనే రికార్డులు క్రియేట్ చేసింది. 

రెండు రోజుల అనంతరం ఈ సినిమా కలెక్షన్లు ఎలా ఉన్నాయి అంటే…

మొదటి రోజు ఇండియాలో ఈ సినిమా ప్రీమియర్ షో వసూళ్లతో కలిపి 84 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్ సాధించింది. రెండో రోజు మరో 20 కోట్ల వసూళ్ల నెట్ ని పొందింది. అలా రెండు రోజుల్లోనే ఇండియాలో ఈ సినిమా 100 కోట్ల మార్క్ దాటింది.

హైదరాబాద్ లో ఈ సినిమా కలెక్షన్లకు భారీ వర్షాలు పెద్ద దెబ్బ కొట్టాయి. ఈ శని, ఆది వారాల్లో ఈ సినిమా మరో 50 నుంచి 60 కోట్ల వరకు వసూళ్లు అందుకోవచ్చు. మొత్తంగా చూస్తే ఈ సినిమాకి దాదాపు 200 కోట్ల వసూళ్లు ఇండియాలోనే వచ్చేలా ఉన్నాయి.ఇక అమెరికాలో, ఇతర ఓవర్ సీస్ మార్కెట్ లో కూడా “ఓజీ” అదరగొడుతోంది.

ఇండియాలో ఓజీ వసూళ్లు ఇలా
ప్రీమియర్ షోలు: రూ. 21 కోట్లు
మొదటి రోజు: రూ 64 కోట్లు
రెండో రోజు: 20 కోట్లు
మొత్తం: రూ. 105 కోట్లు