సిద్దార్థ్ ‘డబుల్ మీనింగ్’ రచ్చ

- Advertisement -
Siddharth


హీరో సిద్ధార్థ్ కి ట్విట్టర్ లో సూపర్ ఫాలోయింగ్ ఉంది. ఇండియా అంతా అతని ట్వీట్స్ చదువుతారు. బీజేపీపై, మోడీపై ఎక్కువగా విమర్శలు సంధించే సిద్ధార్థ్ ట్వీట్లు తరుచుగా వివాదానికి కారణం అవుతుంటాయి. మంచి ఇంగ్లీష్ భాష ఉపయోగిస్తాడు.

ఇటీవల ‘పుష్ప’ సినిమా కలెక్షన్లు కూడా ‘పాన్ ఇండియా బోగస్’ అన్న అర్థంలో ట్వీటాడు. అలాగే, సమంత, నాగ చైతన్య విడిపోయినప్పుడు కూడా ఎక్కువకాలం మోసం చెయ్యలేరు అంటూ సమంతకి ఇన్ డైరెక్ట్ గా రాశాడు.

ఐతే, ఈసారి సిద్ధార్థ్ వేసిన ఒక ట్వీట్ అతన్ని ఇబ్బందుల్లోకి నెట్టేసింది. బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ప్రధాని మద్దతుగా వేసిన
ట్వీట్ కి ఆయన స్పందించిన తీరు ఇప్పటి వివాదానికి కారణం. పంజాబ్ లో ప్రధానిపై దాడికి యత్నం (సెక్యూరిటీ బ్రీచ్ కి ఆమె ఏకంగా దాడి అనే పదాన్ని వాడింది) జరగడం సహించరానిది అనే అర్థంలో సైనా నెహ్వాల్ ట్వీట్ వేసింది.

దాంతో ఆమె ట్వీట్ ని కోట్ చేస్తూ సిద్దార్థ్ సెటైర్ వేశాడు. కానీ అతను వాడిన డబుల్ మీనింగ్ పదాల వల్ల రచ్చ మొదలైంది. “సటిల్ కాక్ చాంపియన్‌” (Subtle Cock Champion) అని రాయడంతో స్త్రీవాదులు, రాజకీయనాయకులు మండిపడుతున్నారు. జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు ఏకంగా సిద్ధార్థ్ పై పోలీసు కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

నటి ఖుష్బూ, సింగర్ చిన్మయి వంటి వారు కూడా సిద్ధార్థ్ డబుల్ మీనింగ్ రాతలను తప్పు పట్టారు. ఐతే, సిద్ధార్థ్ మాత్రం తాను రాసింది ఏంటంటే అంటూ వివరణ ఇస్తూ మరో ట్వీట్ వేశారు.

“మీ బుర్రలో బూతు ఉంది. నేను డబుల్ మీనింగ్ తో రాయలేదు. సైనా నెహ్వాల్ షటిల్ ఆడుతుంది. ఆమె షటిల్ కాక్ తోనే ఛాంపియన్ అయింది కదా దాన్నే నేను సెటైర్ గా వేశాను తప్ప మీరు అనుకునే బూతు అర్థం కాద,”ని వాదిస్తున్నాడు సిద్ధార్థ్.

More

Related Stories