మళ్లీ దాన్నే నమ్ముకున్న పాయల్

పాయల్ రాజపుత్ పాపులర్ అయిందే అందాల ప్రదర్శనతో. బోల్డ్ యాక్టింగ్ తో గుర్తింపు తెచ్చుకొంది. “ఆర్ ఎక్స్ 100” అనే సినిమాలో స్కిన్ షో, ముద్దు సీన్లు, బెడ్ రూమ్ సీన్లతో కిరాక్ పుట్టించింది. వెంటనే హీరోయిన్ గా స్థిరపడింది. ఐతే, ఆ తర్వాత అలాంటి మరికొన్ని సినిమాలు చేసినా ఆమెకి విజయం దక్కలేదు. సో రూట్ మార్చి… “వెంకీమామ”, “డిస్కోరాజా” వంటి రెగ్యులర్ సినిమాల్లో రెగ్యులర్ పాత్రలు చేసింది.

అయినా, ఆమె కెరీర్ కి పెద్ద ఊపు రాలేదు. ఇప్పుడు పూర్తిగా అవకాశాలు తగ్గాయి. పేరున్న హీరోల చిత్రాలు అస్సలు రావడమే లేదు. దాంతో… మళ్ళీ స్కిన్ షోనే నమ్ముకున్నట్లు ఉంది.

ఎన్నో సినిమాల్లో నటించినా చెప్పుకోదగ్గ ఒక్క హిట్ కూడా ఇవ్వని హీరో … ఆది సాయికుమార్. తన సినిమాలో సూపర్ హిట్ వైరల్ సాంగ్ ఉన్నా కూడా ఓపెనింగ్స్ తీచుకోలేని ఆ హీరో నటిస్తున్న కొత్త సినిమాలో పాయల్ రాజపుత్ హీరోయిన్ గా నటిస్తోంది. “తీస్ మార్ ఖాన్” అనే ఈ సినిమాలో పాయల్ సోయగాల షో పట్టువిడుపులు లేకుండా చేసిందట.

తాజాగా విడుదల చేసిన స్టిల్స్ చూస్తుంటే… ఒక రొమాంటిక్ సాంగ్‌ లో ఈ భామ గ్లామర్ అంతా ఒలకబోసింది అనిపిస్తోంది. కెరీర్ కి ఊపు రావాలంటే స్కిన్ షోనే బెటర్ అనే సూత్రాన్ని నమ్ముకొంది పాయల్ రాజపుత్.

Advertisement
 

More

Related Stories