పవన్ తొలి ప్రాధాన్యం ఆ రీమేక్ కే!

- Advertisement -
Pawan Kalyan

ఉన్నట్టుంది సడెన్ గా తన రాజకీయ పర్యటన ఫిక్స్ చేశారు పవన్ కల్యాణ్. పవన్ పొలిటికల్ కెరీర్ లోనే సుదీర్ఘ రాజకీయ యాత్ర ఇది. దీంతో అతడు నటిస్తున్న సినిమాలపై అనుమానాలు పెరిగిపోయాయి. అతడు ఏ సినిమాను ముందుగా పూర్తి చేస్తాడు, ఏ సినిమాను తాత్కాలికంగా పక్కన పెడతాడనే అంశంపై చాలా పెద్ద చర్చ నడుస్తోంది.

ఇందులో భాగంగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో చేయాల్సిన భవదీయుడు భగత్ సింగ్ సినిమాను పవన్ కల్యాణ్ ముందుగా సెట్స్ పైకి తీసుకొస్తాడని అంతా అనుకుంటున్నారు. ఆ తర్వాతే వినోదాయ శితం రీమేక్ సెట్స్ పైకి వస్తుందని అనుకుంటున్నారు. కానీ జీ గ్రూప్ నుంచి వస్తున్న తాజా సమాచారం ప్రకారం.. హరిహర వీరమల్లు సినిమాతో పాటు వినోదాయశితం సినిమానే ముందుగా సెట్స్ పైకి వస్తుందట. ఈ మేరకు పీపుల్ మీడియాతో అగ్రిమెంట్ పూర్తవ్వడంతో పాటు.. కాల్షీట్లు కూడా లాక్ అయ్యాయని చెబుతున్నారు.

ఇదే కనుక నిజమైతే.. హరీశ్ శంకర్ కు మరింత వెయిటింగ్ తప్పకపోవచ్చు. కాకపోతే ఉన్నంతలో ఊరట కలిగే విషయం ఏంటంటే.. స్వయంగా పవన్ కల్యాణ్, హరీశ్ శంకర్ సినిమాను ప్రకటించాడు. ఆ సినిమా రాదంటూ వస్తున్న పుకార్లను ఖండించాడు. సో.. కాస్త లేట్ అయినా హరీష్ సినిమా ఉంటుంది.

తాజా సమాచారం ప్రకారం, వినోదాయ శితం ముందుగా వస్తుంది.

 

More

Related Stories